Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దూసుకెళ్తున్న సల్మాన్ 'ట్యూబ్ లైట్' ట్రైలర్... 44 లక్షల వ్యూస్!

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందిస్తున్న 'ట్యూబ్ లైట్' ట్రైలర్ రిలీజైంది. నిన్న మధ్యాహ్నం ట్రైలర్ రిలీజ్ కాగా, సల్మాన్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. బ్రదర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూస్తుంటే 'భజరంగీ భాయ్ జాన్' మ్యాజిక్ మరోసారి రిపీట్ కానున్నట్టు తెలుస్తోంది.

 'భజరంగీ భాయ్ జాన్' లో చిన్నపిల్ల సెంటిమెంట్ అభిమానులను అలరిస్తే...ఈ సినిమాలో చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన సోదరుడి కోసం వెతికే అన్న పాత్రలో సల్మాన్ ఆకట్టుకున్నాడు. సల్మాన్ మందబుద్ధి కలవాడిగా ఈ సినిమాలో 'లక్ష్మణ్ సింగ్ బిషాంత్' గా నటిస్తుండగా, అతని రియల్ లైఫ్ సోదరుడు సోహైల్ ఖాన్ ఇందులో రీల్ లైఫ్ సోదరుడిగా 'భరత్ సింగ్ బిషాంత్' పాత్రలో నటిస్తున్నాడు. చైనా నటి చూచూ కూడా నటించడం మరో విశేషం. ఈ ట్రైలర్ ను ఇప్పటి వరకు 44, 14, 268 మంది ఇంతవరకు వీక్షించారు. దీనిని మీరు కూడా చూడండి.

More Telugu News