ఫడ్నవీస్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అతి పెద్ద ప్రమాదమే... టీవీ ఛానెల్స్ లో విజువల్స్ ప్రసారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫడ్నవీస్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అతి పెద్ద ప్రమాదమే... టీవీ ఛానెల్స్ లో విజువల్స్ ప్రసారం!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అత్యంత పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కాగా, ఆపై తీసిన దృశ్యాల వీడియో టీవీ చానళ్లలో ప్రసారమవుతోంది. ఈ దృశ్యాల్లో హెలికాప్టర్ రెక్కలన్నీ విరిగిపోయి కనిపిస్తున్నాయి. రెండు తలుపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి కేవలం ఐదారు మీటర్ల దూరంలోనే నివాస గృహాలు ఉన్నాయి. ఓ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ వైర్లు ఉన్నాయి.

చాపర్ రెక్కలు పక్కనున్న రేకుల షెడ్ గోడకు తగిలి విరిగిపోయాయి. వీటి ధాటికి పక్కనే ఉన్న ఓ లారీ అద్దాలు పగిలిపోయాయి. చాపర్ తోకకు ఉండే ఫ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. బేస్ దెబ్బతింది. హెలికాప్టర్ అద్దాలు పగిలిపోయాయి. అయితే, హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చివరి క్షణంలోనే ఇదంతా జరగడం, ఆపై అది కేవలం ఒకటి, రెండు మీటర్ల ఎత్తునుంచే కింద నిట్టనిలువుగా పడటంతోనే అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఏదిఏమైనా పెను ప్రమాదం నుంచి ఫడ్నవీస్ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News