Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా

నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ ఒప్పందంలో భాగంగానే రాజీనామా చేసినట్టు ప్రచండ తెలిపారు. తన రాజీనామా గురించి వెల్లడించిన తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది ఆగస్టులో ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేపాల్ కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్ బా నియమితులవనున్నారు. 

More Telugu News