జిమ్ కు పోయినంత మాత్రాన స్మార్ట్ గా మారరు: అనిల్ కపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిమ్ కు పోయినంత మాత్రాన స్మార్ట్ గా మారరు: అనిల్ కపూర్

తెలుగు సినీ రంగంలో గొప్ప టెక్నీషియన్లు ఉన్నారని... ఇప్పుడు ముంబై మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చెప్పాడు. హాలీవుడ్ లో సైతం సత్తా చాటగలిగిన వారు టాలీవుడ్ లో ఉన్నారని తెలిపాడు. వీరితో సినిమా చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఓ రిసార్ట్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమం కోసం అనిల్ కపూర్ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఈ వయసులో కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన సరదాగా నవ్వేశాడు. జిమ్ కు వెళ్లినంత మాత్రాన స్మార్ట్ గా మారరని... చక్కటి డైట్ ఫాలో అయితేనే ఫలితం ఉంటుందని చెప్పాడు.  

More Telugu News