Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఇలానే మాట్లాడితే, నీకు జీవితాంతం పెళ్లి కాదు’... యాంకర్ రవికి నాగార్జున చురక

‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో రిలీజ్ వేడుకకు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సంపత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆర్టిస్ట్ లకు వెల్ కమ్ చెబుతూ.. మేళాలు మోగిస్తూ వారిని లోపలికి స్వాగతం పలికారు. దీంతో నాగార్జున, నాగ చైతన్య, రకుల్ తదితరులు హుషారుగా స్టెప్పులేశారు. ఆ తర్వాత యాంకర్ రవికి, నాగార్జునకు మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘ చైతన్య చెప్పినట్టు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం సార్. మీరు ఏమంటారు?’ అని ప్రశ్నించగా.. ‘ఇలానే మాట్లాడితే, నీకు జీవితాంతం పెళ్లి కాదు’ అని నాగార్జున అనడంతో నవ్వులు విరిశాయి.

More Telugu News