దమ్ము, ధైర్యం ఉంటే తేల్చుకుందాం రా: కరణం వెంకటేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దమ్ము, ధైర్యం ఉంటే తేల్చుకుందాం రా: కరణం వెంకటేష్

తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి వల్లే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ మండిపడ్డారు. గొట్టిపాటి రవి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఓ ఎమ్మెల్యేగా అందరినీ కలుపుకుని పోవాల్సిన వ్యక్తి, ఇలా హత్యారాజకీయాలకు తెగించడం మంచిది కాదని చెప్పారు. అడవిలో జంతువులను వేటాడినట్టు వేటాడి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారంతా గత 30 ఏళ్లుగా పార్టీ జెండాను మోశారని అన్నారు. అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్తలను గొట్టిపాటి మనుషులు చంపేశారని మండిపడ్డారు. 'దమ్ము, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం.. రా' అంటూ గొట్టిపాటికి సవాల్ విసిరారు.

More Telugu News