'వంకాయ ఫ్రై' హీరోయిన్ అనుస్మృతితో ప్రేమలో పడ్డ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వంకాయ ఫ్రై' హీరోయిన్ అనుస్మృతితో ప్రేమలో పడ్డ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్!

'వంకాయ ఫ్రై' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ అనుస్మృతితో భారత జట్టు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ జంట పబ్బుల్లో కనిపించడం, కారులో ఒకరిపక్కన ఒకరు కూర్చుని షికారుకు వెళుతూ కెమెరాలకు చిక్కడంతో, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే వీరి పెళ్లి జరగవచ్చని నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఈ జంట బాగుందని కూడా కామెంట్లు వస్తున్నాయి. తమ ప్రేమాయణంపై అటు భువీ కానీ, ఇటు అనుస్మృతి కానీ ఇంకా పెదవి విప్పలేదు.

More Telugu News