Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ జాతకంపై కేరళ పండితుడి జోస్యం... పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తుండగా, మరోపక్క తలైవా తమ పార్టీలోకి రావాలంటే... తమ పార్టీలోకి రావాలంటూ వివిధ పార్టీలు ఆయనకు గాలమేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన అభిమానులతో సమావేశమవుతున్నారు. 15న ప్రారంభమైన ఈ సమావేశాల కార్యక్రమం రేపటితో ముగియనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి అభిమాని రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారన్న విషయం అర్థమైంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ జాతకాన్ని ఆయన సన్నిహితుడొకరు కేరళలోని ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించగా, రజనీకి రాజకీయాలు బాగా కలిసి వస్తాయని, ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పారట.

 రాజకీయ అరంగేట్రానికి ఘడియలు కూడా ముంచుకొస్తున్నాయని ఆయన తెలిపారట. ఈ నేపథ్యంలో అభిమానులతో సమావేశాల ముగింపు రోజైన 19వ తేదీన ఆయన రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ మేరకు తమిళనాడు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రజనీకాంత్ పార్టీ పెట్టనున్నారని, ఆ పార్టీ గుర్తు కూడా ఖరారు చేశారని, అందులో బాబా సినిమాలో సింబల్ తోపాటు కమలం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. 

More Telugu News