ప్రపంచ టెలికం దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచ టెలికం దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్!

ప్రపంచ టెలికం దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అపరిమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త, పాత వినియోగదారుల కోసం ఈనెల 17  నుంచి 19 వరకు ఎటువంటి స్పీడ్ పరిమితి లేకుండా ఎస్‌టీవీ-333తో ప్రత్యేకంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంతరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

More Telugu News