: చెప్పినట్టుగానే ... కుప్పం మండలం కనుగోడులో పిడుగుపాటు!
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో పిడుగు పడుతుందని కొంచెం సేపటి క్రితం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ జారీ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. కుప్పం మండలంలోని కనుగోడులో పిడుగుపడింది. కాగా, అనంతపురం జిల్లాలోని గుమ్మగట్ట మండలం కలుగోడులో రెండు రోజుల క్రితం పిడుగు పడి ఐదుగురు రైతులు మృతి చెందారు. ఈ విషయమై నిన్న మంత్రివర్గంలో చర్చకు వచ్చింది.
పిడుగు పడుతుందని విపత్తు నిర్వహణ శాఖ పదిహేను నిమిషాల ముందే సమాచారం పంపినప్పటికీ, ఏ ప్రాంతంలో పిడుగు పడుతుందో తెలియకపోవడంతో అధికారులు అప్రమత్తం కాలేదు. దీంతో, మీడియా ద్వారా ప్రచారం చేయాల్సిందని అధికారులకు సీఎం సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో కుప్పం మండలంలో పిడుగుపడుతుందనే వార్తను ముందుగానే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేశారు.