పరీక్ష హడావుడిలో అతివేగం... ఫ్లైఓవర్ నుంచి కింద పడిన కారు... ఇద్దరి మృతి
పరీక్షకు సమయం మించిపోతుందనే తొందరలో అతి వేగంతో కారు నడుపుతూ వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురైన ఘటన పశ్చిమ ఢిల్లీలో పంజాబీ బాగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. వారు వెళుతున్న హోండా సిటీ కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడింది. దీంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఫ్లైఓవర్‌పై ఒకసారి బోల్తాపడిన కారు అనంతరం డివైడర్‌ను ఢీకొని గాల్లోకి లేచి ఫ్లైవోవర్ గ్రిల్‌ను బద్దలుకొట్టుకొని కిందపడిపోయిందని స్థానికులు తెలిపారు.
ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గాయాలపాలయిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఆ కారులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్‌కు చెందిన ఇద్దరు యువతులు సహా ఏడుగురు విద్యార్థులు ఉన్నారని, వారంతా నరేలాలోని ఐపీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళుతున్నారని పోలీసులు వివరించారు. కారు ఫ్లైవోవర్‌పై కనీసం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందని చెప్పారు.