'నాన్నా నన్ను బతికించు' అని వేడుకున్నా ఆ తండ్రి మనసు కరగలేదు.... ఓ కూతురి కన్నీటి వ్యథ!
తమ ఇంటిని అమ్ముకునేందుకు సహకరించాలని, తమ నివాసాన్ని కబ్జా చేసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేస్తూ తల్లి సుమశ్రీతో పాటు ఆందోళనకు దిగిన సాయిశ్రీ మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రికి పంపిన వీడియో సందేశం సోషల్ మీడియాతో పాటు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వైరల్ అయింది. కేన్సర్ తో బాధపడుతున్న సాయిశ్రీ...తన ప్రాణాలు కాపాడాలంటూ తండ్రిని వేడుకున్న వైనం నెటిజన్లకు కంటనీరు తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సాయిశ్రీ ఆ వీడియో సందేశంలో ఏమందంటే...
'డాడీ! నన్ను బ్రతికించు డాడీ... నేను స్కూల్ కెళ్లి ఎన్ని నెలలు అయిందో నీకు తెలుసు కదా డాడీ. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలని ఉంది. దయచేసి నాకు ట్రీట్ మెంట్ చేయించు డాడీ.... నాకు ట్రీట్ మెంట్ చేయిస్తే నేను హ్యాపీగా స్కూల్ కెళ్లి టెన్త్ క్లాస్ చదువుకుంటా. నా ప్రాణాలు కాపాడు డాడీ. నీకు దండం పెడతా. చేయి కూడా నొప్పిగా ఉంది డాడీ. నీకు దండం పెడదామంటే నా చేయి వాచిపోయి నొప్పిగా ఉంది, కాళ్లు కూడా వాచిపోయాయి డాడీ. కుంటుతూ నడుస్తున్నాను డాడీ.
డాడీ! నన్ను ఎప్పుడూ మీ అమ్మతో పోలుస్తావుగా, వెంకట సుబ్బమ్మ అంటూ అంటుంటావుగా, మీ మమ్మీకే డిసీజ్ వచ్చిందనుకుని నాకు ట్రీట్ మెంట్ చేయించు డాడీ. ఇప్పుడు ట్రీట్ మెంట్ అవసరమంట... లేకపోతే నేను బతకనంట... అమ్మదగ్గరేమో డబ్బుల్లేవు...నిజం డాడీ! అమ్మదగ్గర డబ్బుల్లేవు... పోనీ అమ్మ నీ డబ్బులు తింటుందనుకుంటే, మాకు డబ్బులివ్వద్దు.. నువ్వే హాస్పిటల్ కి వచ్చి, నాకు అవసరమైనప్పుడల్లా డబ్బులు కట్టు. నువ్వే ట్రీట్ మెంట్ చేయించుడాడీ..' అంటూ వేడుకుంది.
అయినా అతను స్పందించడనుకుందో ఏమో కానీ... తనకేమన్నా అయితే తన తండ్రి మాదంశెట్టి శివకుమార్, తన సోదరులు మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారాం కృష్ణ, తన పెద్దమ్మ (తన తండ్రి భార్య) మాదంశెట్టి కృష్ణకుమారిలదే బాధ్యత అని పేర్కొంది.
ఆ ఆస్తికి తాను అడ్డం వస్తానని, తనకు వచ్చిన డిసీజ్ తోనే తనను చంపేయాలని చూస్తున్నారని, తద్వారా చేతికి మట్టి అంటకుండా చూసుకుంటున్నారని పేర్కొంది. ఆ వీడియో చూసిన రెండు రోజుల్లో స్పందించాలని కోరింది. వీడియో కాల్ చెయ్యాలని కోరింది. ఈ సందర్భంగా బాలిక మందుల వివరాలన్నీ ఆ వీడియోలో చూపింది.
అయితే, ఆ తండ్రి రాతిమనసు కరగలేదు!
కాలం మాత్రం వేగంగా కరిగింది... ఆ బాలిక నేడు ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ వీడియో టీవీ ఛానెళ్లలో ప్రసారం కావడంతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో దానిని చూసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.