Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ తో అవకాశం వస్తే.. అసలు వదులుకోనంటున్న బాలీవుడ్ బ్యూటీ

'బాహుబలి' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ పై ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు గుప్పించారు. బాలీవుడ్ నటి అలియా భట్ అయితే ప్రభాస్ పై పొగడ్తల వర్షమే కురిపించింది. ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే మాత్రం... ఆ ఛాన్స్ ను ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోనని చెప్పింది. 'బాహుబలి-2' సినిమా గురించి ఒక్క మాటలో చెప్పడం కుదరదని... ఇదో అద్భుతమైన సినిమా అని తెలిపింది. తనకు ఎంతో నచ్చిందని చెప్పింది. 

More Telugu News