: ప్రపంచంలో అతిపెద్ద సైబర్ ఎటాక్... 100 దేశాలకు షాక్... ఏపీలో 25 శాతం పోలీస్ శాఖ సైట్లు హ్యాక్!


100 దేశాల్లో కంప్యూటర్లపై హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సమాచార, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కుప్పకూలుతున్నాయి. హ్యాకర్ల ధాటికి లండన్ లో వైద్య ఆరోగ్య సేవలు స్తంభించాయి. ఏపీలోని 25 శాతం పోలీస్ వ్యవస్థకు చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేసినట్టు ర్యాన్సమ్ వేర్ ప్రకటించింది. సరికొత్త మాల్ వేర్ తో దాడులు చేసిన హ్యాకర్లు...ఈ కంప్యూటర్లను తిరిగి ఓపెన్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్ గా నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఎయిర్ లైన్స్ తోపాటు ఇతర సంస్థలు కూడా సైబర్ ఎటాక్ బారినపడ్డాయని తెలుస్తోంది. కంప్యూటర్ ఓపెన్ చెయ్యగానే ఒక మెసేజ్ వస్తోందని, అది ఓపెన్ చేయ్యగానే...కంప్యూటర్ మొత్తం కోడింగ్ లోకి మారిపోతుందని తెలుస్తోంది. దానిని తిరిగి ఓపెన్ చెయ్యాలంటే డబ్బులు కట్టాలని మెసేజ్ కూడా వస్తోంది. దీంతో దీనిని డీ కోడ్ చేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ సైబర్ అటాక్ బారిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు, చైనా తదితర దేశాలు పడ్డాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News