Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొరాయించిన ఫేస్ బుక్... పలు దేశాల్లో 'సారీ'!

అమెరికా, మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఫేస్ బుక్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో కస్టమర్లు తీవ్ర ఆయోమయానికి గురయ్యారు. భారత్ లో కొద్దిమంది ఫేస్ బుక్ వినియోగదారులకూ ఈ సమస్య ఎదురైంది. ఈ ఉదయం ఫేస్ బుక్, ఫేస్ బుక్ మొబైల్ యాప్, మెసింజర్ యాప్ లు ఓపెన్ చేసిన వారికి  ‘సారీ, ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అన్న మెసేజ్ కనిపించింది. ఆపై ఫేస్ బుక్ టెక్నాలజీ నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. కొన్ని గంటల్లోనే తమ అన్ని యాప్ ల సేవలూ పునరుద్ధరించబడ్డాయని ఫేస్ బుక్ పేర్కొంది.

More Telugu News