బయో వెపన్ తో కిమ్ జాంగ్ ఉన్ హత్యకు అమెరికా కుట్ర: ఉత్తర కొరియా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బయో వెపన్ తో కిమ్ జాంగ్ ఉన్ హత్యకు అమెరికా కుట్ర: ఉత్తర కొరియా

తమ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ను హత్య చేయాలని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ, సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ లు సంయుక్తంగా కుట్ర పన్నాయని ఉత్తర కొరియా ఆరోపించింది. ఓ జీవ రసాయన ఆయుధాన్ని ప్రయోగించడం ద్వారా కిమ్ ను హత్య చేయాలన్నది వారి పన్నాగమని, అది ఎప్పటికీ విజయవంతం కాదని, వారి ప్రయత్నం కలగా మిగిలిపోతుందని చెప్పింది. గత కొంత కాలంగా ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తుండగా, తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగేలా అమెరికా ప్రయత్నిస్తే, అణ్వస్త్రాల ప్రయోగానికి వెనుకాడబోమని ఉత్తర కొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియాతో కలసి అమెరికా హద్దులు దాటుతోందని, ఈ రెండు దేశాలూ ప్రపంచానికి భూతాలుగా పరిణమించాయని ఉత్తర కొరియా రక్షణ శాఖ ఓ ప్రకటనలో ఆరోపించింది. సీఐఏతో కలసి దక్షిణ కొరియా వేసిన ప్లాన్ ను తాము ఇటీవలే గుర్తించామని, సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో ఇటీవల దక్షిణ కొరియాను సందర్శించినప్పుడు ఈ ప్లాన్ వేశారని పేర్కొంది.

More Telugu News