‘పెళ్లి చూపులు’ చిత్ర బృందాన్ని అభినందించిన కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘పెళ్లి చూపులు’ చిత్ర బృందాన్ని అభినందించిన కేసీఆర్

64వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కేటగిరీల్లో  రెండు అవార్డులను ‘పెళ్లి చూపులు’ చిత్రం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘పెళ్లి చూపులు’ చిత్ర బృందం సీఎం కేసీఆర్ ను ఈ రోజు కలిసింది. హైదరాబాద్ ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసి తమకు లభించిన అవార్డులను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని అభినందించారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో చిత్ర దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్, తదితరులు ఉన్నారు.

More Telugu News