బెంగాల్‌ నటి, మోడల్‌ సోనికా చౌహాన్ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన నటుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగాల్‌ నటి, మోడల్‌ సోనికా చౌహాన్ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన నటుడు

ఇటీవ‌లే బెంగాల్‌ నటి, మోడల్‌ సోనికా చౌహాన్, న‌టుడు విక్రమ్ ఛటర్జీ ఇద్దరూ కలిసి కారులో వెళుతుండగా అది ఒక్క‌సారిగా అదుపు త‌ప్పడంతో డివైడర్‌ను ఢీ కొట్టిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సోనికా చౌహాన్ మృతి చెందింది. కాగా, త‌న కూతురు మృతికి ఆ రోజు కారు న‌డిపిన విక్ర‌మే కార‌ణ‌మంటూ సోనికా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో విక్రమ్ ఛటర్జీ ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని కోర్టుకు హామీ ఇవ్వ‌డంతో, రూ.1000 వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయ‌స్థానం ఆయ‌న‌కు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను సెప్టెంబర్‌ 1న జ‌రుపుతామ‌ని, అప్పుడు ఆయ‌న హాజరు కావాల‌ని ఆదేశించింది.

More Telugu News