Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీలో ట్రక్కు బోల్తా...14 మంది మృతి...24 మందికి తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో వివాహానికి హాజరై వస్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడింది. దీంతో ఈ ట్రక్కులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. కళ్ల ముందే బంధువులు, సన్నిహితులు ప్రాణాలు కోల్పోవడంతో అంతవరకు ఆనందంగా వస్తున్న వారు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News