రోడ్డుపై వాహనాలన్నీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుంటే... ఫైర్ బాల్ లా దూసుకొచ్చి కుప్పకూలిన విమానం.. వీడియో మీరూ చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్డుపై వాహనాలన్నీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుంటే... ఫైర్ బాల్ లా దూసుకొచ్చి కుప్పకూలిన విమానం.. వీడియో మీరూ చూడండి!

అది వాషింగ్టన్ పరిధిలోని ముకిల్టియో ప్రాంతం. రెడ్ లైట్ పడటంతో వాహనాలన్నీ వరుసగా వచ్చి ఆగుతున్నాయి. అంతలోనే గాల్లో ఓ మెరుపు, ఆపై భారీ శబ్దంతో పేలి, గాల్లోకి మంట, పొగలను విరజిమ్ముతూ దూసుకొచ్చిన విమానం నడి రోడ్డుపై కుప్పకూలింది. ఓ కారు డ్యాష్ క్యామ్ లో ఈ ఘటన అంతా రికార్డయింది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అయిన విమానం కాసేపటికే కుప్పకూలిందని 'కోమో న్యూస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అదృష్టవశాత్తూ, పైలట్ సహా ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని తెలిపింది. కుప్పకూలే ముందు ఓ విద్యుత్ స్తంభం తీగలను, ఆపై కొన్ని కార్లను ఈ విమానం ఢీకొన్నప్పటికీ, ప్రమాద తీవ్రత స్వల్పంగానే ఉంది. విమానం కూలబోతుందన్న సంగతి తనకు తెలిసిపోయిందని, అదృష్టంతోనే ప్రాణాలతో బయటపడ్డానని పైలట్ వ్యాఖ్యానించాడు. ఆ వీడియోను మీరూ చూడండి!

More Telugu News