విమానంలో ఇద్దరు ప్రయాణికుల ఫైటింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానంలో ఇద్దరు ప్రయాణికుల ఫైటింగ్!

విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న సంఘటన జపాన్ నుంచి అమెరికా వెళ్లే ఆల్ నిప్పాన్ ఎయిర్ వేస్ విమానంలో జరిగింది. టోక్యోలోని నరితా విమానాశ్రయం నుంచి లాస్ ఏంజిల్స్ కు వెళ్లే ఈ విమానం మరి కొద్ది సేపట్లో టేకాఫ్ తీసుకుంటుందనగా ఇద్దరు ప్రయాణికులు ఊహించని విధంగా ఒకరిపై ఒకరు తలపడ్డారు. ఇందులో, బ్లాక్ టీ షర్టు ధరించి ఉన్న అమెరికన్ వ్యక్తి మద్యం సేవించి ఉండగా, మరో వ్యక్తి రెడ్ షర్టు లో ఉన్నాడు. వీరిద్దరి ఫైటింగ్ కు కారణమేంటనే విషయం తెలియదు.

అయితే, వీరిద్దరిని విమాన సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ గొడవ వల్ల సుమారు యాభై నిమిషాలు ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఇందుకు సంబంధించిన వీడియోను కోరే హార్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ గా మారింది. కాగా, గొడవపడ్డ ప్రయాణికుల పేర్లను వెల్లడించడానికి విమాన సిబ్బంది నిరాకరించారు.

More Telugu News