Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోస్టుమార్టం పూర్తి... నటుడు ప్రదీప్‌ మృతి చెంద‌క‌ముందే రక్తస్రావం అయినట్లు నిర్ధారించిన వైద్యులు

హైదరాబాద్ నార్సింగ్ లోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్ మెంట్ లో తెలుగు టీవీ న‌టుడు ప్రదీప్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్ర‌దీప్ మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం చేశారు. అత‌డి మృతదేహంపై రక్తపు మరకలు ఉన్నట్లు, మృతి చెంద‌క‌ముందే రక్తస్రావం అయినట్లు నిర్ధారించారు. ఈ అంశంపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. మ‌రోవైపు చెన్నైలో ఉంటున్న ప్ర‌దీప్ త‌ల్లి, సోద‌రుడు హైద‌రాబాద్ చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఇప్ప‌టికే ప‌లువురిని ప్ర‌శ్నించి ప‌లు వివ‌రాలు సేక‌రించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా త‌దుప‌రి విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు.                         

More Telugu News