ఆ అవకాశం వస్తే నాకన్నా సంతోషించే వ్యక్తి ఉండడు: బీబీసీ ఇంటర్వ్యూలో రాజమౌళి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ అవకాశం వస్తే నాకన్నా సంతోషించే వ్యక్తి ఉండడు: బీబీసీ ఇంటర్వ్యూలో రాజమౌళి

భారత సినీ రంగంలోని టాప్ స్టార్స్ లో ఒకరైన రజనీకాంత్ తో సినిమా చేయాలని ఏ డైరెక్టర్ అయినా కోరుకుంటాడని దర్శకదిగ్గజం రాజమౌళి అన్నాడు. రజనీతో సినిమా చేయాలనే కోరిక తనకు కూడా ఉందని... ఆయన ఇమేజ్ కు తగ్గ కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. అంత గొప్ప అవకాశం వస్తే తన కన్నా సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరని అన్నాడు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ మేరకు స్పందించాడు. కొన్నేళ్లుగా బాహుబలి సినీ నిర్మాణంతో అలసి పోయిన రాజమౌళి... ఇప్పుడు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలసి లండన్ లో సేదతీరుతున్నాడు.

More Telugu News