ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది!: 'పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌' ప్రారంభోత్సవంలో మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగింది!: 'పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌' ప్రారంభోత్సవంలో మోదీ

హరిద్వార్ లో బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ నిర్మించిన పరిశోధన కేంద్రం పతంజలి యోగ్ పీఠ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురు బాబా రాందేవ్ కి ప్రధాని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, యోగా ప్రాచుర్యానికి, ఆయుర్వేద వైద్యానికి, ఔషధాలకు విశిష్టతను కల్పించారని, భారత ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగిందని అన్నారు. అయితే, ఇప్పటివరకు ఈ ఉత్పత్తులు పేదలకు చేరడం లేదని, ఈ సంస్థ ద్వారా వచ్చే ఉత్పత్తులు వారికి చేరువ కావాలని ఆకాంక్షించారు. కాగా, పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ బృందం రూపొందించిన ప్రపంచ హెర్బల్ ఎన్ సైక్లో పీడియాను మోదీ విడుదల చేశారు. వచ్చే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అహ్మదాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

More Telugu News