మోసూల్ లో అమెరికా దాడి.. భవంతి కూలి వందమంది మృతి.. ఐదు రోజుల తర్వాత బయటపడిన ఒకే ఒక్కడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోసూల్ లో అమెరికా దాడి.. భవంతి కూలి వందమంది మృతి.. ఐదు రోజుల తర్వాత బయటపడిన ఒకే ఒక్కడు!

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు నడుం బిగించిన అమెరికా.. ఇరాక్‌లోని మోసూల్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై భీకర దాడులు  చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల బదులు అమాయక పౌరులు బలవుతున్నారు. ఇటీవల పశ్చిమ మోసూల్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఓ భవంతి నేల మట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఓ వ్యక్తి కొన ఊపిరితో కనిపించాడు.

అలీ జనౌన్ అనే అతడు ఐదు రోజులపాటు శిథిలాల కింద నరకయాతన అనుభవించాడు. రెస్క్యూ సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. కాగా, అమెరికా వాయుసేన దాడులకు భయపడిన వందమంది ఈ భవనంలోనే దాక్కున్నారు. అమెరికా బాంబుదాడిలో అది నేలమట్టమైంది. దీంతో అందులో తలదాచుకున్న వారిలో అందరూ మరణించగా అలీ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఇతనికి ఇరాక్‌లోని ఇర్బిల్‌లో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News