: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం... కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఇందులో పోలవరం పనులు, రాజధాని నిర్మాణంపై చర్చ జరగనున్నాయి. అలాగే ప్రధానంగా జపాన్‌కు చెందిన మాకీ సంస్థకు లీగల్ నోటీసులు ఇచ్చిన అంశంపై తమ తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. వివిధ పోస్టుల స్థాయిల పెంపు, కొత్త పోస్టుల కల్పన, ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రైతులకు మద్దతు ధర అంశంపై కూడా చర్చించి ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.