: బాహుబలి టికెట్ల కోసం కిలోమీటర్ల మేర క్యూ... పోలీసుల భారీ బందోబస్తు
'బాహుబలి: ది కన్ క్లూజన్' అడ్వాన్స్ బుకింగ్స్ నేడు ప్రారంభం కానుండటంతో, థియేటర్ల వద్ద సినీ అభిమానులు బారులు తీరారు. టికెట్ల కోసం అభిమానులు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరారు. హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరంలోని ఐమాక్స్ టికెట్ కౌంటర్ నుంచి ప్రారంభమైన క్యూ మింట్ కాంపౌండ్ వరకూ సాగింది. అభిమానుల మధ్య తొక్కిసలాట జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పీవీఆర్, ఐనాక్స్ తదితర మల్టీప్లెక్సులతో పాటు సత్యం, రామకృష్ణ, దేవి, సుదర్శన్ వంటి సింగల్ థియేటర్ల వద్దా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే విధమైన సందడి నెలకొంది.