Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ నూతన గృహప్రవేశానికి హాజరైన పవన్ కల్యాణ్!

ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఇటీవలే నూతన గృహ ప్రవేశం కూడా జరిగిందట. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రముఖ పాటల రచయిత సీతారామశాస్త్రి దంపతులు హాజరైనట్టు సమాచారం. గృహప్రవేశం చాలా సింపుల్ గా జరిగినట్టు ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాలకు చేరిన ఫొటోల ద్వారా తెలుస్తోంది. కాగా, త్రివిక్రమ్ కొత్త ఇంటిని ఎక్కడ నిర్మించింది, ఎంత ఖర్చు అయిందనే వివరాలు బయటకు రాకపోవడం గమనార్హం.

More Telugu News