వాళ్లు తలలు మాత్రమే నరుకుతారు.. నేను ఏకంగా వాళ్లనే తినేస్తా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాళ్లు తలలు మాత్రమే నరుకుతారు.. నేను ఏకంగా వాళ్లనే తినేస్తా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు

తమ దేశంలో ప్రారంభ‌మైన‌ క్రీడా టోర్నమెంటు వేడుక‌లో పాల్గొన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు సృష్టిస్తోన్న బీభ‌త్సం గురించి మాట్లాడుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ‘వారి క‌న్నా నేను 50 రెట్లు అధికంగా క్రూరుడిని.. వాళ్లు తలలు మాత్రమే నరుకుతారు... నాకు ఉగ్రవాదులు సజీవంగా దొరికితే మాత్రం వాళ్లను తినేస్తా’ అని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి మ‌రోసారి అంత‌ర్జాతీయంగా వార్తల్లో నిలిచారు. ప్రజల్లో తీవ్ర భయోత్పాతాన్ని కలిగించడానికి ఉగ్ర‌వాదులు తలలు నరికేస్తున్నారని, అయితే, వాళ్లు జంతువుల లాంటివాళ్లు కాబట్టి సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయ‌న అన్నారు.

ఉగ్ర‌వాదుల‌ను కాల్చిపారేయాలని రోడ్రిగో.. తమ సైనికులకు సూచించారు. తాను కూడా జంతువులాగే మారాలనుకుంటే మారతానని వ్యాఖ్యానించిన ఆయ‌న‌... ఉగ్రవాదులను సజీవంగా తనకు అప్పగిస్తే మాత్రం కాస్త ఉప్పు, వెనిగర్ పట్టించి, వాళ్ల లివర్‌ను తినేస్తానని అన్నారు. ఉగ్రవాదం అంశాన్ని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. 

More Telugu News