మీ యుద్ధనౌకను ఒకే దెబ్బకు ధ్వసం చేస్తాం: అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ యుద్ధనౌకను ఒకే దెబ్బకు ధ్వసం చేస్తాం: అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్

అగ్రదేశం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది ఉత్తరకొరియా. యుద్ధనౌకలను తీసుకొచ్చి తమ ముందు బల ప్రదర్శన చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. అమెరికాకు చెందిన కార్ల్ విన్సన్ అనే భారీ యుద్ధనౌక ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఉంది. ఇప్పటికే జపాన్ కు చెందిన రెండు యుద్ధనౌకలు ఈ నౌకతో చేరాయి. ఇరు దేశాలు కలసి పశ్చిమ పసిఫిక్ లో బలప్రదర్శన చేయనున్నాయి.

మరోవైపు, ఉత్తరకొరియా జలాల్లో మకాం వేయాలని... అవసరమైతే అదను చూసి దెబ్బకొట్టాలంటూ యుద్ధనౌకకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ యుద్ధనౌకలో యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది. ఒకే దెబ్బతో మీ యుద్ధనౌకను ధ్వంసం చేసి, సముద్రంలో ముంచేస్తామని... దీనికోసం తమ విప్లవ బలగాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.

More Telugu News