అబద్ధం చెప్పి మోసం చేశాను.. నన్ను క్షమించండి: సంపూర్ణేష్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అబద్ధం చెప్పి మోసం చేశాను.. నన్ను క్షమించండి: సంపూర్ణేష్ బాబు

తాను ఒక ఎన్నారైనని... విదేశాల్లో బాగా సంపాదించి, ఇక్కడకు వచ్చి సినిమాలు తీస్తున్నానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పానని... అయితే, అదంతా అబద్ధమని, తనను క్షమించాలని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అన్నాడు. తన అసలు పేరు నరసింహాచారి అని... సినిమాల్లోకి రాక ముందు సిద్ధిపేటలో ఓ బంగారం దుకాణంలో పని చేసేవాడినని చెప్పాడు. తాను ఇప్పటికీ సిద్ధిపేటలోనే ఉంటానని... సినిమా షూటింగ్ ఉన్నప్పుడే హైదరాబాదుకు వస్తుంటానని తెలిపాడు. ఊర్లో ఉంటే ఇప్పటికీ సైకిల్ పై తిరుగుతానని చెప్పాడు. పిల్లలను కూడా సైకిల్ మీదనే స్కూల్ కు తీసుకెళతానని తెలిపాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వచ్చానని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంపూ ఈ విషయాలను వెల్లడించాడు. 

More Telugu News