తనకొచ్చిన ఊహించని సూచనపై స్పందించిన కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తనకొచ్చిన ఊహించని సూచనపై స్పందించిన కేటీఆర్

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే తెలంగాణ పంచాయితీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కు ఓ అభిమాని నుంచి ఊహించని సలహా వచ్చింది. దీనిపై ఆయన కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇటీవల ఆయన పాతబస్తీలో విస్తృతంగా పర్యటించి, ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సందర్భంగా కాసేపు క్రికెట్, బాస్కెట్ బాల్ ఆటలను సరదాగా ఆడి, ఆ ఫోటోలను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశారు. దీనిపై ఎంఎన్ ప్రపుల్ల కుమార్ అనే యువకుడు స్పందిస్తూ, "ఈ మధ్యకాలంలో నెరసిన జుట్టుతో కనిపిస్తున్నారు. మీరు యూత్ లీడర్, మంత్రుల్లో మీరే పిన్నవయస్కులు కాబట్టి జుట్టుకు రంగు వేసుకోవాలి" అని సూచించాడు. దీనిపై స్పందించిన కేటీఆర్, రిప్లయ్ ఇస్తూ, తాను మరీ కుర్రాడిని ఏమీ కాదని చెప్పడం ఈ ట్వీట్లను చూసిన వారికి నవ్వు పుట్టించింది.

More Telugu News