ఓ దివ్యశక్తి ప్రవేశిస్తేనే మంచి పాట రాయగలుగుతానని నమ్ముతా: అనంత శ్రీరామ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ దివ్యశక్తి ప్రవేశిస్తేనే మంచి పాట రాయగలుగుతానని నమ్ముతా: అనంత శ్రీరామ్

ఓ దివ్యశక్తి పెన్నులోకి ప్రవేశిస్తేనే మంచి పాటలు రాస్తానని తాను నమ్ముతానని ప్రముఖ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను భావించేది ఏంటంటే.. మనం ఏం చదువుకున్నాము..నేర్చుకున్నాము? అనేవి అన్నీ వదిలేస్తే .. పాట రాసేందుకు కూర్చున్నప్పుడు ఓ దివ్యశక్తి పెన్నులోకి ప్రవేశించకపోతే మంచి పాటలు రావు అనేది నా ఉద్దేశం. నేను అది నమ్ముతున్నాను కాబట్టి, ఒకవేళ, నేను పాట బాగా రాస్తే..ఆ దివ్యశక్తి నా మీద ఎక్కువ దయ చూపినట్టు. బాగా రాయకపోతే, ఆ దివ్యశక్తి నా మీద ఎక్కువ దయ చూపనట్టు. అందులో, నా గొప్పతనమూ లేదు తప్పూ లేదు. కాబట్టి, ఒక గొప్ప పాట రాసినా, ఒక చెత్త పాట రాసినా కూడా నేను కాదు కాబట్టి.. అందుకు సంబంధించిన భావోద్వేగానికి లోను కాను... ప్రస్తుతం నాకు ఉన్న స్థానానికి ఆనందపడటం లేదు, అలా అని నిరుత్సాహమూ లేదు’ అని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

More Telugu News