తెలంగాణ ఎమ్మెల్యే కోనప్పకు వడదెబ్బ.. ఆసుపత్రికి తరలింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఎమ్మెల్యే కోనప్పకు వడదెబ్బ.. ఆసుపత్రికి తరలింపు

సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు వడదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే, కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించి ఆయనకు చికిత్స అందించారు. కాగా కుమరంభీం జిల్లా బెజ్జూరు మండలంలోని ముంజంపల్లిలో కొమరం భీం విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు.

More Telugu News