'బీకాంలో ఫిజిక్స్'పై జలీల్ ఖాన్ తాజా వివరణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బీకాంలో ఫిజిక్స్'పై జలీల్ ఖాన్ తాజా వివరణ!

టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన 'బీకాంలో ఫిజిక్స్' వ్యాఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నోటి నుంచి బీకాంలో ఫిజిక్స్ పై సరికొత్త వ్యాఖ్య వెలువడి నవ్వులు పూయిస్తోంది. ఓ టీవీ ఛానెల్ తో జలీల్ ఖాన్ మాట్లాడుతూ, 'సోషల్ మీడియా ఇంటర్వ్యూలో తాను చెప్పింది పెట్టకుండా... ఆయన క్లబ్ చేసి, మిక్స్ చేసి, తాను అననిది అనినట్టు రూపొందించార'ని అన్నారు. దీంతో ఆయనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి... 'అసలు బీకాంలో ఫిజిక్స్ ఉందా?' అని అడుగగా ఆయన సమాధానమిస్తూ... 'అసలు నేను అన్లా...అది'...అంటూ ఆయన చెప్పబోయేంతలో ఆ 'ఇంటర్వ్యూ నేను చూశాను... మీరేమన్నారో విన్నాను... ఇప్పుడు చెప్పండి' అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడగడంతో... జలీల్ ఖాన్ మళ్లీ వివరణ ఇస్తూ...'నేను మెట్రిక్యులేషన్ పాసయ్యాను అని అన్నప్పుడు, 'ఇంత మంచి మార్కులతో సెకెండ్ క్లాస్ లో పాసయ్యారు కదా   హయ్యర్ స్టడీస్ చెయ్యాలనుకోలేదా?' అని ఆయన అడిగాడు.

అసలు చదివితే ఏం చదవాలనుకుంటున్నారు? అని అడిగాడు. అప్పుడు నేను బీకాం చదివేవాడినని అన్నాను. మెట్రిక్యులేషన్ లో నేను ఎంపీసీ గ్రూపు చదివాను.. అని, ఆ వెంటనే 'కాదు.. పీయూసీలో ఎంపీసీ గ్రూపు... అది కూడా 30 సంవత్సరాల తరువాత అడిగితే ఏం గుర్తుంటుంది? మొన్ననే జగన్మోహన్ రెడ్డిగారు రెండు 28లు 64 అన్నారు. దానిని ఎవరూ పట్టించుకోలేదు... రాష్ట్రానికి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి...వాటిని పట్టించుకోవాలి' అని ఆయన అన్నారు. దీంతో ఆయన ఇంటర్వ్యూ నవ్వులు పూయిస్తోంది.

More Telugu News