: ఆయన చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసినవి కాదు: తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ
దక్షిణ భారతీయులు నల్లగా ఉంటారని వ్యాఖ్యానించిన బీజేపీ నేత తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ దక్షిణాదిలో ఎదగలేదని తెలిసే, ఉత్తరాదిలో బలపడేందుకు ఆ పార్టీ అధిష్ఠానం తమ నేతలతో ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తోందని అన్నారు. ఆ పార్టీ భారతీయతను హిందూత్వంగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తరుణ్ విజయ్ దక్షిణ, ఉత్తరభారత్ తేడాపై చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసినవి కాదని అన్నారు. వైసీపీ నుంచి ఫిరాయించిన నేతలను ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కూడా స్పందించిన నారాయణ.. టీడీపీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షం అన్నది లేకుండా చేస్తోందని అన్నారు.