: మరోమారు.. రెడ్ మి 4 ఏ ఫ్లాష్ సేల్ ఆఫర్ !
స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ఏ ను ఫ్లాష్ సేల్ ద్వారా మరోమారు విక్రయించనున్నట్టు షియామి సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 13న ‘అమెజాన్’ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ‘ఎం.కామ్’, ‘అమెజాన్’ ద్వారా ఆన్ లైన్ విక్రయాలు ఉంటాయని తెలిపింది. కాగా, గత నెలలో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేశారు. ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు సార్లు ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మకాలు జరిపారు.