: రియల్టీ రారాజు చేతికి బేడీలు... ఢిల్లీలో యునిటెక్ ఎండీ అరెస్ట్!
రియల్టీ రంగంలో ప్రముఖ కంపెనీ అయిన యునిటెక్ సంస్థ ఎండీ సంజయ్ చంద్ర, ఆయన సోదరుడు అజయ్ చంద్రలను ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసింది. గ్రేటర్ నోయిడా నివాస భవనాల ప్రాజెక్టులో ఫ్లాట్లను బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు వాటిని స్వాధీనం చేయకుండా వీరు మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకపోగా, తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వడంలో చంద్ర సోదరులు విఫలమవడంతో కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన డబ్బులను మరో షెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం వీరిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.