: సీఎం ఆదిత్యనాథ్ పని తీరుపై అప్పుడే విమర్శలా!: అఖిలేష్ బాబాయి రాంగోపాల్ యాదవ్
ఉత్తరప్రదేశ్ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణం నుంచే పలు పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేష్ బాబాయి, సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. యోగి పని తీరుపై అప్పుడే విమర్శలు గుప్పించడం సబబు కాదని, ఆరు నెలల తర్వాత విమర్శలు గానీ, సమీక్షలు గానీ చేయాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, గోరఖ్ పూర్ నుంచి ఏడుగురు పురోహితులను రప్పించి సీఎం యోగి తన అధికారిక నివాసంలో పూజలు నిర్వహించారు. దీనిపై వస్తున్న విమర్శలను రాంగోపాల్ యాదవ్ కొట్టి పారేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించడం సాధారణమే కదా? అన్నారు.