ప్రధానికి ‘ఫ్లిప్ కార్ట్’ సీఈఓ ప్రశంస.. స్పందించిన మోదీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధానికి ‘ఫ్లిప్ కార్ట్’ సీఈఓ ప్రశంస.. స్పందించిన మోదీ!

మన దేశ ప్రజలను ప్రధాని మోదీ ఎంత బాగా అర్థం చేసుకుని తన వైపు తిప్పుకున్నారో చెప్పడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలే నిదర్శనమని ఫ్లిప్ కార్ట్  సీఈఓ సచిన్ బన్సల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు చూస్తేనే తెలుస్తోందని, ఇటీవల వెలువడ్డ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా మోదీ మన దేశాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారనే విషయం అర్థమవుతుందని, ఇది వ్యాపారవేత్తలకు ఓ పాఠం కావాలని,  మోదీ ఏ విధంగా అయితే ప్రజలను అర్థం చేసుకున్నారో, ఖాతాదారులను అర్థం చేసుకునే విషయంలో వ్యాపారవేత్తలు అదే మార్గాన్ని అనుసరించాలని ఆ ట్వీట్ లో ఆయన సూచించారు. కాగా, ఈ ట్వీట్ కు ప్రధాని మోదీ స్పందిస్తూ, ‘ప్రజలను నేను అర్థం చేసుకోవడం కన్నా, బీజేపీపై వారు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని మేము పోగొట్టుకోము’ అని అన్నారు.

More Telugu News