కేన్సర్, హృద్రోగ బాధిత చిన్నారులకు సచిన్ ఆపన్న హస్తం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేన్సర్, హృద్రోగ బాధిత చిన్నారులకు సచిన్ ఆపన్న హస్తం

కేన్సర్, హృద్రోగ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపన్నహస్తం అందించేందుకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముందుకొచ్చాడు. ఇందుకోసం అస్టర్ డీఎం ఫౌండేషన్‌తో కలిసి సచిన్ పనిచేయనున్నాడు. టెండూల్కర్ తోడ్పాటుతో 50 మంది చిన్నారుల వైద్యానికి అయ్యే ఖర్చును అస్టర్ డీఎం ఫౌండేషన్ భరించేందుకు ముందుకొచ్చింది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు నామమాత్రపు ఫీజు కడితే మిగతా మొత్తాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు, టెండూల్కర్ అందిస్తారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ చిన్నారులకు చేయూత కోసం అస్టర్ డీఎం హెల్త్‌కేర్ గ్రూప్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

More Telugu News