అమెరికాలో మళ్లీ జాత్యహంకార దాడి... తెలుగు మహిళపై కత్తితో దాడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో మళ్లీ జాత్యహంకార దాడి... తెలుగు మహిళపై కత్తితో దాడి

ఇటీవల అమెరికాలో తెలుగువాడు కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపగా, మరో భారతీయుడి స్టోర్ ను తగులబెట్టేశారు. తాజాగా ఫిలడెల్ఫియాలో తెలుగు మహిళపై దుండగుడు జాత్యహంకార దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఆమెపై దాడికి దిగిన దుండగుడు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ ఘటన అమెరికాలో ఉంటున్న భారతీయులందర్నీ, ప్రధానంగా తెలుగువారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో భయాందోళనలకు గురైన తెలుగు ఎన్నారైలు, ఈ ఘటనతో అమెరికాలో ఉండడంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. కాగా, ఈ దాడిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

More Telugu News