ఆండ్రియాతో నగ్న చిత్రం తీసిన సెల్వ రాఘవన్... సుచిత్ర మరో సంచలన లీక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆండ్రియాతో నగ్న చిత్రం తీసిన సెల్వ రాఘవన్... సుచిత్ర మరో సంచలన లీక్

సోషలీ మీడియాలో సెలబ్రిటీల రహస్యాలను లీక్ చేస్తూ, దక్షిణాది చిత్ర పరిశ్రమలో పెను కలకలానికి కారణమైన గాయని సుచిత్ర, మరో సంచలన విషయాన్ని గురించి లీక్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో తన సినిమాలు హిట్ కాక ఇబ్బందులు పడుతున్న సెల్వ రాఘవన్, నటి ఆండ్రియాతో ఓ నగ్న చిత్రాన్ని తీశాడన్నదే ఈ తాజా లీక్ సారాంశం. సుచీ లీక్స్ పేరిట బయటకు వచ్చిన ఓ ఈ-మెయిల్ ఇది. సెల్వ రాఘవన్ నుంచి ఆండ్రియాకు అందినట్టుగా ఉన్న ఈ మెయిల్ లో, ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదే సమయంలో ఆండ్రియా నుంచి సెల్వ రాఘవన్ సతీమణి గీతాంజలికి పంపినట్టు చెబుతున్న ఇంకో మెయిల్ వివరాలూ బయటకు వచ్చాయి. తనతో 'ది ఘోస్ట్' అనే చిత్రాన్ని సెల్వ తీశాడని, ఇది పూర్తి రొమాంటిక్ మూవీ అని, తనను దాదాపు నగ్నంగా చూపారని ఆమె చెప్పినట్టు ఇందులో ఉంది. చిత్రం పూర్తి కాకపోవడంతో, రెమ్యునరేషన్ తీసుకోలేదని, దీన్ని ఎడిట్ చేస్తే, ఓ ఆర్ట్ చిత్రంలా, అలాగే వదిలేస్తే పోర్న్ సినిమాలా ఉంటుందని ఆండ్రియా సదరు మెయిల్ లో చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను తిరిగి ప్రారంభించాలని భావిస్తే, తాను నటిస్తానని, వద్దనుకుంటే, ఆ ఫుటేజ్ మొత్తాన్నీ నాశనం చేయాలని సెల్వకు చెప్పాలని గీతాంజలిని కోరినట్టు ఉంది. ఒకవేళ సినిమా ఫుటేజ్ లీకైతే, అవి వైరల్ అవుతాయని టెన్షన్ తో ఉన్నట్టు ఈ-మెయిల్ లో ఆండ్రియా వాపోయినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఈ-మెయిల్ ఏ మేరకు నిజమన్నది సెల్వ లేదా ఆండ్రియా స్పందిస్తేనే తెలుస్తుంది.

More Telugu News