కొంటెగా ఓ నవ్వు నవ్వి...రాంగోపాల్ వర్మకు దండం పెట్టేసిన సన్నీలియోన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొంటెగా ఓ నవ్వు నవ్వి...రాంగోపాల్ వర్మకు దండం పెట్టేసిన సన్నీలియోన్!

అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది. వర్మ ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం 'మహిళాసాధికారత, సమాన అవకాశాలు, ఉన్నతస్ధాయి' అని మాట్లాడుతుండగా, రాంగోపాల్ వర్మ మాత్రం 'ప్ర‌పంచంలో ప్ర‌తి మ‌హిళ‌.. స‌న్నీ లియోన్‌ లాగా పురుషుల‌కు సంతోషాన్నివ్వాల‌ని కోరుకుంటున్న‌ా'నని పేర్కొనడం దారుణమని మండిపడుతున్నారు.

ఒక నెటిజన్ వర్మ ట్వీట్ పై ధ్వజమెత్తుతూ 'నీ తల్లి, కుమార్తెకు కూడా ఇలాగే చెబుతావా?' అని ప్రశ్నించగా, ఓ యువతి 'నీ తల్లిని కూడా ఇలాగే అడుగుతావా?' అని నిలదీసింది. అయితే ఈ ట్వీట్ పై సన్నీ లియోన్ కూడా స్పందించడం విశేషం. తన రిప్లైలో ఎలాంటి వ్యాఖ్య చేయని సన్నీలియోన్ కొంటెగా కన్నుగీటిన ఎమోజీని... 'బాబూ! నీకో దండం' అంటూ మూడు నమస్కారాల ఎమోజీలను పోస్టు చేసింది. 

More Telugu News