అనాధలా కుక్క చావు చస్తావు... నా మాటకు తిరుగులేదు: ట్రంప్ కు శాపం పెట్టిన సిద్ధాంతి ములుగు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనాధలా కుక్క చావు చస్తావు... నా మాటకు తిరుగులేదు: ట్రంప్ కు శాపం పెట్టిన సిద్ధాంతి ములుగు

పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్, ట్రంప్ ను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుక్క చావు చస్తాడని శాపనార్థాలు పెట్టారు. ఆయన జాతక చక్రం ప్రకారం, ఏలినాటి శని నడుస్తోందని, దీని ప్రభావంతో ఆయన పూర్తి కాలం పాటు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగలేరని జోస్యం చెప్పారు. "ఓరీ జాత్యహంకారీ డోనాల్డ్ ట్రంప్... నీవల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీవు చేసినటువంటి పాపాలకు ఫలితం చెబుతున్నా విను. ఇదే నేను నీకు ఇచ్చే శాపం. నీ అంత్య కాలంలో, నీ మరణ సమయంలో, నీ సన్నిహితులుగానీ, నీ మిత్రులుగానీ, నీ భార్యగానీ, నీ బంధువులుగానీ ఎవ్వరూ లేకుండా, అనాధలాగా కుక్క చావు చస్తావు. నా మాటకు తిరుగులేదు" అని శాపం పెట్టారు.

More Telugu News