గూగుల్, వాట్సాప్‌తో మేం హ్యాపీ.. ఎయిర్‌టెల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూగుల్, వాట్సాప్‌తో మేం హ్యాపీ.. ఎయిర్‌టెల్

యాప్ ఆధారిత కాలింగ్, మెసేజింగ్ సంస్థల సర్వీసులకు సంబంధించిన నిబంధనలపై ట్రాయ్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. బార్సిలోనాలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన గూగుల్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నెట్ సంస్థలతో తాము హ్యాపీగా కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంపెనీలు, టెలికం కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని, తమ మధ్య ఇప్పుడు ఎటువంటి ఒత్తిళ్లు లేవని పేర్కొన్నారు. టెలికం కంపెనీల సహకారం లేకుండా ఓటీటీ సంస్థలు సేవలు అందించలేవన్నారు. టెలికం కంపెనీలు పెట్టుబడులను అధికంగా పెడుతుండడం వల్ల ఓటీటీల్లా తక్కువ రేట్లకు సర్వీసులను అందించే అవకాశం ఉండడం లేదన్నారు. టెలికం కంపెనీలు 20 వేల కోట్ల డాలర్ల మూల ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని సునీల్ మిట్టల్ తెలిపారు.

More Telugu News