జేసీని సమర్థిస్తున్న చంద్రబాబు ఏం తింటున్నారో?: అంబటి రాంబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జేసీని సమర్థిస్తున్న చంద్రబాబు ఏం తింటున్నారో?: అంబటి రాంబాబు

వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను అసభ్య పదజాలంతో తన ఇష్టానుసారం విమర్శిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, దివాకర్  ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డిని  సీఎం చంద్రబాబు సమర్థిస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జేసీని సమర్థిస్తున్న చంద్రబాబు అన్నం తింటున్నారా? లేక మరేమైనా తింటున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించినా కక్ష తీరలేదా? అని ప్రశ్నించిన అంబటి, మరో ఐదుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోందని, అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేత ఒక్కరున్నా తమ గొంతుక వినిపిస్తామని, ప్రజా సమస్యలపై పోరాడతామని అంబటి రాంబాబు అన్నారు.

More Telugu News