Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భావోద్వేగంలోనే ఆ వ్యాఖ్యలు చేశాను.. ఉపసంహరించుకుంటున్నా!: కేరళ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ నేత

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తల తీసి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్‌ నేత కుందన్‌ చంద్రావత్‌ ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ లో హింసకు తావులేదని చెబుతూ అగ్రనాయకత్వం మెట్టికాయలు వేయడంతో, దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్న భావోద్వేగంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశానని అన్నారు. తాను గతంలో చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నానని ఆయన చెప్పారు. ఆ ప్రకటన పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, అయితే ఆ ప్రకటన చేసిన తరువాత తనను హత్య చేస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. 

More Telugu News