అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్పా, పార్టీ మాత్రం మారను!: దగ్గుబాటి పురందేశ్వరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్పా, పార్టీ మాత్రం మారను!: దగ్గుబాటి పురందేశ్వరి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి దగ్గుబాటి పురందేశ్వరి త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని, వైఎస్సార్సీపీలో చేరుతున్నారనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరుణంలో పురందేశ్వరి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు.

‘సామాజిక మాధ్యమాలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తుండటం చాలా బాధాకరం. నేను పార్టీ మారుతున్నాననే వదంతులు నన్ను చాలా కలచి వేశాయి. ప్రతి ఒక్కరిని, వారి మనోభావాలను గౌరవిస్తున్నాను. అదే సమయంలో, నేను చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతున్నాను. బీజేపీలోనే నేను కొనసాగుతాను. ఒకవేళ, ఆ పార్టీలో కొనసాగలేని పరిస్థితులు తలెత్తితే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నా తండ్రి, నా భర్త రాజకీయ విలువలు నేర్పించారు, అదే బాటలో నేను కొనసాగుతున్నాను’ అని ఆ పోస్ట్ లో పురందేశ్వరి పేర్కొన్నారు.

More Telugu News