విరాట్‌ కోహ్లీపై వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా ప్రశంసల జల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విరాట్‌ కోహ్లీపై వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా ప్రశంసల జల్లు

అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతూ మెరుగైన ప్రతిభ కనుబరుస్తోన్న భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా ప్రశంసల్లో ముంచెత్తాడు. కోహ్లీ అద్భుతంగా ఆడుతూ టీ20 బ్యాటింగ్‌ శైలిని టెస్టు, వన్డేల్లోనూ ఉపయోగిస్తున్నాడని, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన చేరుతున్నాడని అన్నాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడ‌ని, అతడి నైపుణ్యం గొప్పదని అన్నాడు. సచిన్‌ దారిలోనే కోహ్లీ అడుగులేస్తూ ఆ స్థాయిని చేరుకొనేందుకు సిద్ధమవుతున్నాడని ప్ర‌శంసించాడు. ఇండియ‌న్స్‌, క్రికెట్‌ అభిమానులు విరాట్‌ నుంచి మ‌రిన్ని అద్భుతాలు ఆశిస్తున్నారని ఆయ‌న చెప్పాడు. కాగా, క్రికెట్‌లో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని, బ్యాట్స్‌మెన్‌ వినూత్నంగా ప్రయత్నిస్తున్నార‌ని బ్రయాన్‌ లారా పేర్కొన్నాడు.

More Telugu News